శరవేగంగా సీతమ్మ.. రామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై రాజ్‌తరుణ్ కథానాయకుడిగా శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీ్ధర్‌రెడ్డి, హరీశ్ దుగ్గిశెట్టి మాట్లాడుతూ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సున్నితమైన భావోద్వేగాలు ప్రతి ప్రేక్షకుడి హృదయానికి హత్తుకుంటాయని, వినోదానికి పెద్దపీట వేసిన ఈ సినిమాలో ప్రతి పాత్ర ప్రేక్షకులను నవ్విస్తుందని తెలిపారు. కథానాయకుడి పాత్ర సినిమాలో హైలెట్‌గా వుంటుందని, అర్తన అనే నూతన కథానాయికని పరిచయం చేస్తున్నామని, త్వరలో ఆడియో విడుదల చేసి సినిమాను వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. రణధీర్, రాజారవీంద్ర, ఆదర్శ్, షకలక శంకర్, మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ, రత్నాసాగర్, నవీన్, భార్గవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:గోపీసుందర్, పాటలు:సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, వనమాలి, కృష్ణచైతన్య, ఎడిటింగ్:కార్తీక్ శ్రీనివాస్, కెమెరా:విశ్వ, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:శ్రీనివాస్ గవిరెడ్డి.

మూడు భాషల్లో
వీరప్పన్

శ్రీకృష్ణా క్రియేషన్స్ పతాకంపై రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో సందీప్ భరద్వాజ్ ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని వచ్చే నెల 4న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 90వ దశకంలో కర్నాటక, తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి దాదాపు 20 సంవత్సరాల తరువాత దొరికిన వీరప్పన్‌కు సంబంధించిన కథ, కథనం ఈ చిత్రంలో ఉంటుందని తెలిపారు.
వీరప్పన్ విలక్షణ వ్యక్తిత్వాన్ని, అతని పద్ధతిని ఈ చిత్రంలో రాంగోపాల్‌వర్మ సరికొత్తగా ఆవిష్కరించారని, వీరప్పన్ బ్రతికి ఉన్నప్పుడు ఎక్కడ ఏం జరిగిందో, అక్కడే ఆయా దృశ్యాలను చిత్రీకరించామని, సినిమా మొత్తం వీరప్పన్ బయోపిక్‌లా కాకుండా ఇతరుల దృష్టికోణంలో అతను ఎలా వున్నాడు అనే కథనంతో సాగుతుందని తెలిపారు. వీరప్పన్ మరణానికి ప్రధాన పాత్ర పోషించిన పోలీస్ అధికారి చెప్పిన కథనంతో ఈ చిత్రం ఉంటుందని, ప్రధాన పాత్ర ప పోషించిన సందీప్ భరద్వాజ్ నిజమైన వీరప్పన్‌లా ప్రేక్షకులకు విస్మయం కలిగించేలా నటించాడని, ఈనెల 4న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రమ్మి, సంగీతం: రవిశంకర్, ఎడిటింగ్: అన్వర్ అలీ, నిర్మాతలు: బి.వి.మంజునాధ్, ఇ. శివప్రకాష్, బి.ఎస్.సుధీంద్ర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాంగోపాల్‌వర్మ.