గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ‘ఆక్సిజన్’ చిత్రంలో నటిస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమాతోపాటు ఆయన మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే బి.గోపాల్ దర్శకత్వంలో మూడేళ్ళ క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఇంకా పూర్తికాలేదు సరికదా.. ఎప్పుడు విడుదల అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. గోపీచంద్ సరసన నయనతార నటిస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్‌గా ఓ టైటిల్ ఓకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటో తెలుసా.. ‘వీడు ఆరడుగుల బుల్లెట్టు’? పవర్‌స్టార్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ పవర్‌ను తెలిపే సాంగ్ ఇది.. ఈ పాటలోని ఆరడుగుల బుల్లెట్టు టైటిల్‌ని కొద్దిగా మార్చి, ‘వీడు ఆరడుగుల బుల్లెట్’ అనే టైటిల్ పెట్టారట!! ఇక ఈ సినిమా మూడేళ్లయినా షూటింగ్ పూర్తికాక పోవడానికి ముఖ్య కారణం నయనతార అని తెలిసింది. ఈ సినిమాకోసం ఆమె కాల్షీట్స్ ఇవ్వడం లేదట. కావాలనే నయనతార సతాయిస్తుందని అంటున్నారు. నయనతార ఈ సినిమాకోసం ఇంట్రెస్ట్ పెడితే సినిమా పూర్తవుతుందని అంటుంది చిత్ర యూనిట్. మరి నయనతార ఈ సినిమా ఎప్పుడు పూర్తిచేస్తుందో...? ఆ సినిమా ఎప్పుడు బయటికి వస్తుందో చూడాలి!!