లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామగా సౌత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుని ముఖ్యంగా టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న కాజల్, ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. లేటెస్టుగా మెగాస్టార్‌తో ‘అమ్మడు కుమ్ముడు’ అంటూ ఖైదీ నెం.150తో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకూ గ్లామర్ హీరోయిన్‌గా అలరించిన కాజల్, ఈసారి సోలోగా తన సత్తా చాటడానికి సిద్ధమైంది. లేటెస్టుగా ఆమె ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించేందుకు ఓకె చెప్పిందట. ఇదివరకే జీవా-కాజల్ జంటగా ‘కావలైవేండాం’ చిత్రాన్ని రూపొందించిన తమిళ దర్శకుడు డి.కె. తన తదుపరి చిత్రంగా ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడని, కావలైవేండాం షూటింగ్ సమయంలోనే కాజల్‌కు కథ చెప్పి ఒప్పించాడట. ఈ కథ విన్న కాజల్ సినిమా చేయడానికి తెగ ఆసక్తిగా వుందని తెలిసింది. మరి కావలైవేండాంతో ఫ్లాప్‌ను అందుకున్న డి.కె. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని ఎలా రూపొందిస్తాడోనన్న ఆసక్తి మొదలైంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలు ఎక్కనున్నదట. మరి ఈ సినిమాతో కాజల్ ఎలాంటి ఇమేజ్‌ను దక్కించుకుంటుందో చూడాలి!