అందుకే రాలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ సుందరాంగులకు ఇండియా వైడ్‌గా మార్కెట్ వుంటుంది అనడంలో విడ్డూరం లేదు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు, భారతదేశం మొత్తంమీద ఆ హీరోయిన్ అందరికీ తెలిసిపోతుంది. అలాంటి మార్కెట్‌ను వదులుకుని దక్షిణాదిలో కేవలం ఓ ప్రాంతీయ భాషా చిత్రంలో నటించడానికి సైతం బాలీవుడ్ కథానాయికలు ముందు వరసలో నిలబడ్డారు. అందుకు తగ్గట్టు మంచి పాత్ర లభించి నటిగా నిరూపించుకున్నారు. ఐశ్వర్యరాయ్ తొలిసారిగా దక్షిణాదిలోనే నటించి అందగత్తే కాదు మంచి నటి కూడా అని నిరూపించుకుంది. అలా అనేకమంది హీరోయిన్లు దక్షిణాది చిత్రాల్లో నటించారు. కానీ స్టార్‌డమ్‌లో వున్న కరీనాకపూర్ మాత్రం దక్షిణాదిలో ఒక్క సినిమాలో కూడా నటించకపోవడానికి కారణమేమిటని ఇటీవల అడిగితే, అందుకు కచ్చితమైన సమాధానం చెప్పింది. తనకు దక్షిణాది భాషలతో ఎటువంటి పరిచయం లేదని, అందుకే భాష తెలియకుండా నటించడం తనకు చేతకాదని చెప్పుకొచ్చింది. అయితే దక్షిణాది భాషలు, దక్షిణాది చిత్రాలంటే తనకు చిన్నచూపు లేదని, ఆ సినిమాలు చాలా బాగుంటాయని, వాటిల్లో కథ, కథనాలు అద్భుతంగా తీర్చిదిద్దుతారని కితాబు ఇచ్చింది. ఏది ఏమైనా ఒక్క దక్షిణాది చిత్రంలో కూడా నటించలేదు అని అంటే, కారణం భాషేనని చెబుతోంది. అది తప్ప మరో కారణం అంటూ ఏదీ లేదని, భవిష్యత్తులో కూడా దక్షిణాది చిత్రాల్లో నటించే అవకాశం లేదని కుండ బద్దలుకొట్టినట్లు చెప్పేసింది. సో.. కరీనాను మనం హిందీ చిత్రాల్లోనే చూసి ఆనందించాలి.. అంతే!

చిత్రం..కరీనాకపూర్