భయపెట్టే మరకతమణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాణి జంటగా ఎ.ఆర్.కె.శరవణన్ దర్శకత్వంలో రిషి మీడియా, శ్రీచక్ర ఇన్నోవేషన్స్ పతాకాలపై తెరకెక్కుతున్న చిత్రం ‘మరకతమణి’. అడ్వెంచర్స్ ఘోస్ట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ- ‘సరైనోడు’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో వైరం ధనుష్‌గా తిరుగులేని ఇమేజ్‌ని స్వంతం చేసుకున్న ఆది హీరోగా నటించిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నిక్కీ గల్రాణి నటన, గ్లామర్ మరో హైలెట్‌గా నిలువనున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ‘కబాలి’ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ అసిస్టెంట్ దిబూ థామస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలు త్వరలో విడుదల చేస్తాం. ప్రేక్షకులకు నచ్చే అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన చిత్రమిది అన్నారు. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఆనంద్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దిబూ నైనస్ థామస్, కెమెరా: పి.వి.శంకర్, ఎడిటింగ్:ప్రసన్న.జి.కె, దర్శకత్వం: ఎ.ఆర్.కె.శరవణన్.