ప్రభాస్ కోసం బాలీవుడ్ భామ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’ తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న నెక్స్ట్ సినిమా ఇదివరకే ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. బాహుబలి-2 సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అయింది. దాంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు బాహుబలి-2 సినిమా విడుదలతోపాటు టీజర్‌ను కూడా రిలీజ్ చేసి ఈ సినిమాపై క్రేజ్ పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం అప్పుడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందే ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్‌ని దించుతున్నారట. ‘బాహుబలి’తో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్‌గా మారాడు కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ అయితే బెటర్ అనే ఆలోచనలో భాగంగా ఇప్పటికే పలువురు టాప్ హీరోయిన్స్‌తో చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.