17న హ్యాపీ బర్త్‌డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ నందన్ మూవీస్ పతాకంపై చెన్నమనేని శ్రీ్ధర్, జ్యోతి సేథి జంటగా పల్లెల వీరారెడ్డి దర్శకత్వంలో మహేష్.కె నిర్మిస్తున్న చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 17న విడుదలకు సిద్ధమైన సందర్భంగా నిర్మాత మహేష్ వివరాలు తెలియజేస్తూ- యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇటీవలే సినిమా రంగంలోని ప్రముఖులకు, డిస్ట్రిబ్యూటర్లకు సినిమా చూపించాము. అందరికీ బాగా నచ్చింది. సినిమా విడుదల కోసం చాలామంది పోటీపడుతున్నారు. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ నెల 17న విడుదల చేస్తున్నాం అన్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని వారి అభినందనలు అందుకుంది. నేటి యూత్‌కి కనెక్ట్ అయ్యే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందన్న నమ్మకం వుంది అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌రెడ్డి, ఎడిటింగ్: మహేంద్రనాధ్, ఆర్ట్: మురళికృష్ణ కొండేటి, నిర్మాత: మహేష్.కె., దర్శకత్వం: పల్లెల వీరారెడ్డి.