9 నుండి రెగ్యులర్ షూటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనతా గ్యారేజ్ తరువాత కాస్త గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుని షూటింగ్‌కు సిద్ధమైంది. నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెట్స్‌పైకి ఎప్పుడొస్తుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ను జరుపుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నెల 9 నుండి జరిగే మరో షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొంటాడట. ఇప్పటికే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేయడం విశేషం. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కన్పిస్తాడని, ఈ చిత్రానికి ‘జై లవకుశ’ అనే టైటిల్‌ను పెడుతున్నట్లు ప్రచారంలో వుంది. ఈ విషయంపై యూనిట్ నుండి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. ఇక ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా రాశీఖన్నా నటిస్తోంది. మరో ఇద్దరు హీరోయిన్ల ఎంపిక జరగాల్సి వుంది. మరోవైపు ఈ సినిమాకు బిజినెస్‌పరంగా భారీ ఆఫర్లు వస్తున్నాయని తెలిసింది. జనతా గ్యారేజ్‌తో బాక్సాఫీస్ వద్ద 80 కోట్ల మార్కెట్‌ను రాబట్టుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో ఏకంగా 100 కోట్ల మార్కెట్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.