ఏదైనా పర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకానొక సమయంలో టాప్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అగ్రస్థానం వహించిన ఛార్మికి ఇప్పుడు అవకాశాలు ఏ మాత్రం తలుపు తట్టడంలేదు. స్టార్ హీరోయిన్‌గా అనేక చిత్రాల్లో నటించి ఉత్తమ నటిగా కూడా అవార్డులు అందుకున్న ఛార్మి కెరీర్ ప్రస్తుతం కుదేలైపోయింది. ఆమెకు కనీసం ‘జ్యోతిలక్ష్మి’ సినిమా తరువాత హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు వస్తాయనుకుంటే, ఆ సినిమా ఫెయిల్యూర్ తరువాత అవకాశాలు సన్నగిల్లాయి. అందుకే ఇప్పుడు ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధమంటూ సంకేతాలు పంపిస్తోంది ఛార్మి. ఏదో ఒక రోల్‌లో లైమ్‌లైట్‌లో వుంటేనే ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా మంచి పాత్రలు లభిస్తాయని, ఒక్క సినిమా క్లిక్ అయినా మరికొన్ని చిత్రాలకు అవకాశాలు వస్తాయని ఆశిస్తోంది. ప్రస్తుతం ‘జ్యోతిలక్ష్మి’ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన ఆమె, అలాంటి పాత్రలకు కూడా సై అంటోంది. త్వరలో బాలకృష్ణతో పూరి జగన్నాధ్ రూపొందించబోయే ఓ చిత్రంలో ఆమెకు ఏదో ఒక పాత్ర దర్శకుడు ఇస్తాడని టాలీవుడ్ టాక్. ఐటెం సాంగ్‌లకు ఎప్పుడో తెరతీసిన ఛార్మి, అలాంటి పాటలకు కూడా ఓకె అంటోంది. హీరోయిన్‌గా అవకాశాలు రాకపోయినా చిన్న పాత్రల్లో సైతం నటించడానికి ముందుకు వస్తున్న ఛార్మి ధైర్యానికి అందరూ మెచ్చుకుంటున్నారు. సో.. ఏదోవిధంగా నటనలోనే జీవించాలని ఆమె ఆశ. కీపిటప్..!