మహేష్ మర్మం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు కథానాయకుడుగా నటిస్తున్న 23వ సినిమాపై ఇంకా అనుమానాలు రేకెత్తుతూనే ఉన్నాయి. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాకు పేరు కానీ, పోస్టర్‌కానీ ఇంతవరకు విడుదల చేయలేదు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై ఏడాది ముగుస్తున్నా చిత్రం గురించి ఒక్క విషయం కూడా బైటికి రాలేదు. కానీ చిత్రాన్ని మాత్రం జూన్ 23న విడుదల చేస్తున్నట్టుగా దర్శకుడు ప్రకటించాడు. ఈ సినిమా టైటిల్‌పై ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ‘సంభవామి యుగేయుగే’ అన్న పేరును పెడుతున్నట్టు నిర్మాత ఆ మధ్య ప్రకటించడంతో అభిమానులలో అలజడి రేగింది. కానీ ఈ సినిమాకోసం దర్శకుడు మరో పేరును వెతుకుతున్నాడని సమాచారం. ఈ చిత్రానికి మర్మం, రహస్యం అనే అర్థం వచ్చేలా టైటిల్ ఖరారు చేయాలని యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రంలో కథానాయకుడు సీక్రెట్ ఏజెంట్ అవడంతో ఈ టైటిల్‌కు న్యాయం జరిగేలా వుంది. అందుకనే ఈ టైటిలే ఖరారు అవుతుందని చెబుతున్నారు. ఉగాది సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది.