అందరికీ నచ్చే పిశాచి పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వర్ణ్భారతి క్రియేషన్స్ పతాకంపై ఆర్.జె.రూపేశ్ శెట్టి, రమ్య జంటగా దేవరాజ్‌కుమార్ దర్శకత్వంలో సాయివెంకట్ అందిస్తున్న చిత్రం ‘పిశాచి-2’ (డేంజర్ జోన్). అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- వైవిధ్యమైన కథనంతో రూపొందించిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని, పెద్ద విజయం సాధించాలని అన్నారు. వెరైటీ కథ, కథనాలతో హారర్ బ్యాక్‌డ్రాప్‌లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌లో రూపొందిన ఈ చిత్రం ఈనెల 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. కార్యక్రమంలో శివాజీరాజా, ఎన్.రామచంద్రరావు, మల్‌రెడ్డి రంగారెడ్డి, రమ్యశ్రీ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా:వీనస్ మూర్తి, సంగీతం:సతీష్ ఆర్యన్, దర్శకత్వం:దేవరాజ్‌కుమార్.