నేనోరకం పాటలు బాగున్నాయి -పూరి జగన్నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌శంకర్ కథానాయకుడుగా శరత్‌కుమార్ కీలకమైన పాత్రలో సలేంద్ర దర్శకత్వంలో శ్రీకాంత్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘నేనోరకం’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమంలో దర్శకుడు పూరి జగన్నాథ్, దేవిశ్రీప్రసాద్, గోపీచంద్ ఒక్కొక్క పాటను ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కథానాయకుడు గోపీచంద్ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్లు, పాటలు బాగున్నాయని, ఈ సంవత్సరంలో ఓ మంచి సినిమాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.
తానీ సిసిమా చూశానని, కథాకథనాలు చాలా గ్రిప్పింగ్‌గా సాగుతాయని, రామ్‌శంకర్‌కు మరో హిట్‌గా నిలుస్తుందని, పాటలన్నీ సందర్భానుసారంగా ప్రేక్షకులను అలరిస్తాయని, దర్శకుడు పూరి జగన్నాథ్ తెలిపారు. థ్రిల్లింగ్, లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సమకాలీన అంశాల స్ఫూర్తితో పక్కా కమర్షియల్ ఫార్మాట్‌లో దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించాడని, కథానాయకుడు రామ్‌శంకర్ తెలిపారు. మహిత్ పాటలు, రీరికార్డింగ్ చిత్రానికి ఎస్సెట్‌గా నిలుస్తాయని, శరత్‌కుమార్ కథ నచ్చి ఈ సినిమా చేశారని, ప్రతి ప్రేక్షకుడు ఓ సరికొత్త ఫీల్‌ను ఈ సినిమా ద్వారా ఆస్వాదిస్తారని దర్శకుడు తెలిపారు. హీరో రామ్‌శంకర్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా ‘నేనోరకం’ నిలుస్తుందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు మహిత్‌నారాయణ్, దేవిశ్రీప్రసాద్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు. రేష్మీమీనన్ కథానాయికగా నటిస్తున్నారు.