మూడు భాషల్లో వీరప్పన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణా క్రియేషన్స్ పతాకంపై రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో సందీప్ భరద్వాజ్ ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని వచ్చే నెల 4న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 90వ దశకంలో కర్నాటక, తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి దాదాపు 20 సంవత్సరాల తరువాత దొరికిన వీరప్పన్‌కు సంబంధించిన కథ, కథనం ఈ చిత్రంలో ఉంటుందని తెలిపారు.
వీరప్పన్ విలక్షణ వ్యక్తిత్వాన్ని, అతని పద్ధతిని ఈ చిత్రంలో రాంగోపాల్‌వర్మ సరికొత్తగా ఆవిష్కరించారని, వీరప్పన్ బ్రతికి ఉన్నప్పుడు ఎక్కడ ఏం జరిగిందో, అక్కడే ఆయా దృశ్యాలను చిత్రీకరించామని, సినిమా మొత్తం వీరప్పన్ బయోపిక్‌లా కాకుండా ఇతరుల దృష్టికోణంలో అతను ఎలా వున్నాడు అనే కథనంతో సాగుతుందని తెలిపారు. వీరప్పన్ మరణానికి ప్రధాన పాత్ర పోషించిన పోలీస్ అధికారి చెప్పిన కథనంతో ఈ చిత్రం ఉంటుందని, ప్రధాన పాత్ర ప పోషించిన సందీప్ భరద్వాజ్ నిజమైన వీరప్పన్‌లా ప్రేక్షకులకు విస్మయం కలిగించేలా నటించాడని, ఈనెల 4న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రమ్మి, సంగీతం: రవిశంకర్, ఎడిటింగ్: అన్వర్ అలీ, నిర్మాతలు: బి.వి.మంజునాధ్, ఇ. శివప్రకాష్, బి.ఎస్.సుధీంద్ర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాంగోపాల్‌వర్మ.