నా బెస్ట్ మూవీ అదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీతిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై రెహమాన్, ప్రకాష్ విజయ్ రాఘవన్, అశ్విన్‌కుమార్ తదితరులు తారాగణంగా కార్తీక్ నరేన్ దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘16-ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్’. ఈ సినిమా మార్చి 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ- తమిళంలో గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ధృవంగల్ 16 సినిమాను తెలుగులో ‘16 ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్’ పేరుతో విడుదల చేస్తున్నామన్నారు. కర్ణాటకలో కూడా సినిమా పెద్ద సక్సెస్ అయిందని, మార్చి 10న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో లక్ష్మణ్ సినిమాను విడుదల చేస్తున్నారని, మంచి నావెల్టీతోపాటు కంటెంట్ ఉన్న సినిమా ఇదని, కార్తీక్ నరేన్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారన్నారు. రెండు సినిమాల్లో నటించిన తనకు ఇది కెరీర్‌లో బెస్ట్ మూవీ ఇది అన్నారు. చిత్ర దర్శకుడు కార్తీక్ నరేన్ మాట్లాడుతూ- కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ సినిమాలో ఉండకపోయినా డిఫరెంట్ ఫీల్‌ను ఇస్తుందని, మార్చి 10న విడుదలవుతున్న ఈ సినిమాను అందరూ పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ- రెహమాన్ నటన, కార్తీక్ నరేన్ టేకింగ్ సినిమాకు హైలెట్ అని, క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని, ఈ సినిమా గ్యారంటీగా హిట్ అవుతుందని అన్నారు. టి.ప్రసన్నకుమార్, లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం:బిజోయ్, కెమెరా:సుజిత్ సరాంగ్, ఎడిటింగ్:శ్రీజిత్ సరాంగ్, మాటలు:శివరామ ప్రసాద్ గోగినేని, నిర్మాత:చదలవాడ పద్మావతి, రచన, దర్శకత్వం:కార్తీక్ నరేన్.