చిత్రాంగద ఎంతో ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం చిత్రాంగద. తమిళంలో యార్నీ పేరుతో నిర్మిస్తున్న ఈ హారిజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి ‘పిల్లజమీందార్’ ఫేం అశోక్ దర్శకుడు. శ్రీవిఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 10న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అంజలి మాట్లాడుతూ, ‘‘గీతాంజలి తరువాత నేను నటించిన హీరోయిన్ సెంట్రిక్ మూవీ చిత్రాంగద. నాకు పర్సనల్‌గా చాలా ఇష్టమైన సినిమా. సినిమా కోసం హార్డ్‌వర్క్ చేశాను. నా గత చిత్రాలకు భిన్నంగా ఉండే సినిమా. అశోక్ సినిమాను చక్కగా తెరకెక్కించారు. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది’ అని అన్నారు. సప్తగిరి మాట్లాడుతూ ‘హారర్ మూవీస్‌లో గతంలో చాలా మంచి రోల్స్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాను. చిత్రాంగద సినిమాలో నా రోల్‌కు చాలా మంచి పేరు వస్తుంది. యు.ఎస్‌లో డిఫరెంట్ క్లైమాక్స్‌లో సినిమాను షూట్ చేశాం. అంజలి హీరోలా యాక్ట్ చేశారు. అంజలి కష్టానికి తప్పకుండా ఫలితం వస్తుంది’ అని అన్నారు.
జి.అశోక్ మాట్లాడుతూ- చిత్రాంగదలో లీడ్‌రోల్‌లో చాలా ధైర్యంగా నటించిందని, హారర్, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయని, అమెరికాలో క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో మంచి లొకేషన్స్‌లో సినిమా తీశామని అన్నారు. సప్తగిరి మెయిన్ కమెడియన్‌గా నటించారని, మార్చి 10న సినిమాను మల్కాపురం శివకుమార్ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారని అన్నారు. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని కానె్సప్టు ఈ చిత్రాంగద అన్నారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ‘గీతాంజలి వంటి ఉమెన్ సెంట్రిక్ మూవీలో నటించిన అంజలి, అంతకంటే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా చిత్రాంగద. మార్చి 10న సినిమా విడుదలవుతుంది. సినిమాపై నమ్మకంతో డిస్ట్రిబ్యూర్స్, ఎగ్జిబిటర్స్ సినిమాను విడుదల చేయడానికి ముందుకు వచ్చారు’ అని అన్నారు.