హీరోయిన్‌గా రాజశేఖర్ కుమార్తె?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజశేఖర్-జీవితల పెద్ద కుమార్తె శివాని త్వరలో హీరోయిన్‌గా వస్తుందంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎంట్రీ త్వరలో ఖాయమని చెప్పారు కానీ, అది ఏ హీరో, ఏ దర్శకుడు అనేది మాత్రం క్లారిటీ రాలేదు. మొన్నమధ్య జీవిత కూడా ఇదే విషయంమీద ప్రశ్నిస్తే, అలాంటిదేం లేదు అంటూ చెప్పింది. ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉన్నామని ఆమె చెప్పకుండా చెప్పింది. ఇంతకీ విషయం ఏమిటంటే, హీరోయిన్‌గా శివానిని దర్శకుడు తేజ పరిచయం చేయబోతున్నాడు అని తెలుస్తోంది. ప్రస్తుతం రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాన్ని రూపొందిస్తున్న ఆయన, ఆ వెంటనే ఈ చిత్రాన్ని ప్రారంభిస్తాడని సమాచారం. గతంలో రాజశేఖర్-తేజల కాంబినేషన్‌లో ‘అహం’ అనే చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నదని సమాచారం ఉన్నా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. కానీ కూతురుతో సినిమా చేసేందుకు దర్శకుడు ఓకె చెప్పడంతో ఈ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానున్నదని వినికిడి.

చిత్రం..శివాని