కామెడీ హారర్‌తో టిక్‌టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటుడు, నిర్మాత, దర్శకుడు పోలిచర్ల హరనాధ్ తాజాగా నటిస్తూ దర్శక నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం ‘టిక్ టాక్’. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన హరనాధ్ పొలిచర్ల టిక్ టాక్.కామ్ పేరిట రూపొందించిన వెబ్‌సైట్‌ను హైదరాబాద్ సారధి స్టూడియోలో సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ- హరనాధ్ సదుద్దేశంతో సినిమాలు చేస్తుంటారని, ప్రస్తుతం సినిమాకు ప్రమోషన్ చాలా అవసరమని, ఈ నేపథ్యంలో హరనాధ్ వెబ్‌సైట్ లాంచ్ చేయడం చాలా మంచి ఆలోచన అని, హరనాధ్ గత చిత్రాల వలె ఈ చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. పొలిచర్ల హరనాధ్ మాట్లాడుతూ- ప్రస్తుతం సినిమాకి పబ్లిసిటీకి చాలా ప్రాధాన్యత సంతరించుకుందని, సినిమాని ప్రేక్షకులకు చేరువ చేయడంలో భాగంగా ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించానని అన్నారు. కామెడీ హారర్‌గా రూపొందుతున్న చిత్రమిదని, అన్ని వర్గాలవారిని అలరించేలా ఈ చిత్రం ఉంటుందని, ప్రస్తుతం ఈ చిత్రం రెగ్యులర్‌గా షూటింగ్ జరుపుకుంటోందని అన్నారు. ఈ సినిమా తరువాత రెగ్యులర్‌గా ఐదు సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు. పోలిచర్ల హరనాధ్, నిషిగంధ, వౌనిక, రాహుల్, సందీప్, ఆనంద్, సాయికృష్ణ, అల్లు రమేష్, రమణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:ఎస్ అండ్ బి మ్యూజిక్ మిల్, కెమెరా:పి.వంశీకృష్ణ, ఎడిటింగ్:వెంకటరమణ, ఆర్ట్:ఎ.గోవింద్, పాటలు:కరుణాకర్, చారి, డాన్స్:గోవింద్.సిహెచ్. మూలకథ:లిఖిత్ శ్రీనివాస్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత:పోలిచర్ల హరనాధ్.