అందరికీ నచ్చే మిక్చర్ పొట్లం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయంత్, శే్వతాబసు ప్రసాద్, గీతాంజలి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘మిక్చర్‌పొట్లం’. సతీష్‌కుమార్.ఎం.వి. దర్శకత్వం వహిస్తున్నారు. గోదావరి సినీ టోన్ పతాకంపై కలపటపు శ్రీలక్ష్మిప్రసాద్, కంటె వీరన్న చౌదరి, లంకలపల్లి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మాధవపెద్ది సురేష్ చంద్ర సంగీతం అందించిన ఆడియో ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలై శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో ఆడియో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ- ఇటీవల విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని, సింగర్ సుచిత్ర ఆలపించిన ‘హలో బేబి’ పాటకు మంచి స్పందన వస్తోందని, నేటి యువత పల్స్ పట్టుకుని మంచి ట్యూన్స్ సమకూర్చారని అన్నారు. ట్యూన్స్‌తోపాటు, పాటల్లో సాహిత్యం కూడా అర్ధవంతంగా ఉందని, తొలి కాపీ సిద్ధమైందని, మార్చి నెలాఖరుకల్లా సినిమా విడుదల చేస్తామని చెప్పారు. సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని, రాజమండ్రి అందాలను మరింత ఎలివేట్ చేస్తూ తెరకెక్కించామని, మంచి ఔట్‌పుట్ వచ్చిందని అన్నారు.
నిర్మాత కలపటపు శ్రీలక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ నిర్మాతగా ‘మిక్చర్ పొట్లం’ తొలి ప్రయత్నమని, హీరో హీరోయిన్లు కొత్తవాళ్లైనా మిగతా నటీనటులు, టెక్నీషియన్లు అంతా సీనియర్లేనని, కథను దర్శకుడు తను అనుకున్న విధంగా తెరకెక్కించాడని అన్నారు. మంచి పాటలు కుదిరాయి కాబట్టే శ్రోతల్ని ఆకట్టుకున్నాయని, కుటుంబ సమేతంగా కలిసి చూడదగ్గ చక్కని సినిమా ఇదని, ఇటీవల విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభించిందని, సినిమా కూడా ఆ స్థాయి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.
మరో నిర్మాత లంకలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తొలి కాపీ సిద్ధమైందని, త్వరలోనే సినిమా రిలీజ్ చేస్తామని అన్నారు. సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ మాట్లాడుతూ- నేటి యువతరానికి తగ్గట్టు మంచి పాటలు కుదిరాయని, దర్శకుడు కథను అద్భుతంగా తెరకెక్కించాడని, బాపు-రమణలకు ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నామని అన్నారు. ఈ వేడుకలో హీరోయిన్ గీతాంజలి, కంటె వీరన్న చౌదరి, మురళి, వేణు తదితరులు పాల్గొన్నారు. భానుచందర్, సుమన్, కృష్ణ్భగవాన్, పోసాని, అలీ, చిట్టిబాబు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు:వెనె్నలకంటి, చిర్రావూరి విజయకుమార్, రాంభట్ల నరసింహ శర్మ, భాషాశ్రీ, కెమెరా:కళ్యాణ్ సమీ, నిర్మాతలు:కలపటపు శ్రీలక్ష్మి ప్రసాద్, కంటె వీరన్న చౌదరి, లంకలపల్లి శ్రీనివాసరావు, దర్శకత్వం:సతీష్‌కుమార్.ఎం.వి.