క్రిష్ దర్శకత్వంలో కల్యాణ్‌రామ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలే తెలుగు వీరుడు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కథను తెలుగు ప్రేక్షకులకు అందించి మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు క్రిష్, తన తదుపరి చిత్రంగా మరో నందమూరి హీరోతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈసారి ఆయన దర్శకత్వంలో నటించేది ఎవరో కాదు కల్యాణ్‌రామ్. పటాస్ విజయం తరువాత కల్యాణ్‌రామ్‌కు చెప్పుకోదగ్గ సక్సెస్ దక్కలేదు.
పూరి జగన్నాథ్‌తో చేసిన ఇజం కూడా అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని కళ్యాణ్‌రామ్ క్రిష్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే వీరిద్దరిమధ్య కథా చర్చలు జరిగినట్టు తెలిసింది. కళ్యాణ్‌రామ్‌కోసం క్రిష్ ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేశాడని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.