జమున పాత్రలో సమంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సమంత ప్రస్తుతం నటనకు ఆస్కారం వున్న పాత్రలో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. తాజాగా వచ్చిన ‘అఆ’ చిత్రం కూడా సమంత పాత్ర చుట్టే కథ తిరుగుతూ సమంతలోని నటిని ఆవిష్కరించే ప్రయత్నాన్ని చేశారు. తాజాగా మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కే చిత్రంలో నటిస్తుండడంతో సావిత్రి పాత్రలో సమంత నటిస్తుందని అనుకున్నారందరూ. కానీ అందరికీ షాక్ ఇస్తూ ఈ పాత్రలో మరో అందాల భామ కీర్తి సురేష్ నటిస్తుందని చెప్పేశాడు దర్శకుడు. లేటెస్ట్‌గా సావిత్రి, సమంత, కీర్తిలతో ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఐతే సావిత్రి సినిమాలో సమంత పాత్ర ఏమిటనే ప్రశ్న అందరిలో తలెత్తింది. ముఖ్యంగా ఈ సినిమాలో సావిత్రికి అత్యంత సన్నిహితురాలుగా ఉన్న మరో హీరోయిన్‌గా సమంత పాత్ర ఉంటుందని సమాచారం. ఆమె ఎవరో కాదు జమున అని తెలిసింది. అప్పట్లో వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. సావిత్రికి సంబంధించిన ప్రతి విషయంలో జమున సపోర్ట్ అందిస్తుందని ఓ సందర్భంలో సావిత్రి తెలిపింది కూడా. ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ సినిమాలో ఇంకా కొన్ని ముఖ్యమైన పాత్రలు ఉన్నాయని, ముఖ్యంగా సావిత్రి ప్రేమకథ కూడా చూపిస్తారట. మరి ఈ సినిమాలో జమున పాత్రలో సమంత ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి!