చెన్నయ్‌లో మహేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న 23వ చిత్రం నేటి నుండి చెన్నయ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ చెన్నయ్‌లో ప్రారంభమైంది. ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఫొటోను విడుదల చేశారు. ఈనెల 16న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ మీడియాలో రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. మహేష్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన హక్కుల విషయంలో కూడా భారీ పోటీ ఏర్పడిందని తమిళ, తెలుగు భాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ సినిమాతో 200 కోట్ల మార్కెట్‌ను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని జూన్ 23న విడుదల చేస్తున్నట్టు మురుగదాస్ తెలిపారు. అయితే ఉగాది సందర్భంగా టీజర్‌ను కూడా విడుదల చేసే అవకాశం వున్నట్టు వార్తలు వస్తున్నాయి.