మేడమీద అబ్బాయి ఏం చేస్తాడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్, నిఖిలా విమల్ జంటగా జి.ప్రజిత్ దర్శకత్వంలో జాహ్నవి ఫిలిమ్స్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్న ‘మేడమీద అబ్బాయి’ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్‌నివ్వగా నూజివీడు సీడ్స్ వైస్ ప్రెసిడెంట్ రామకోటేశ్వరరావు స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. నేను చేస్తున్న 53వ సినిమా ఇదని, ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’ తరహాలో భిన్నమైన సినిమా చేయాలని ఉండేదని, తాను చేసే రెగ్యులర్ కామెడీకి భిన్నంగా రూపొందుతున్న సినిమా ఇదని అన్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ఒరువడక్కం సెల్ఫీ’ చిత్రానికి రీమేక్ ఇదని, ఆ చిత్రాన్ని రూపొందించిన ప్రజిత్ తెలుగులో కూడా చేస్తున్నారని, రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందే సినిమాలో అన్ని రకాల అంశాలు ఉంటాయని, ఈనెల 16నుండి పొలాచిలో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్‌లోనే షూటింగ్ పూర్తిచేస్తామని అన్నారు.
హీరోయిన్ నిఖిలావిమల్ మాట్లాడుతూ.. తమిళ, మలయాళంలో రెండేసి సినిమాలు చేశానని, తెలుగులో ఇది తన మొదటి చిత్రమని, తప్పకుండా నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నానని అన్నారు. సంగీత దర్శకుడు వసంత్ మాట్లాడుతూ.. నరేష్‌తో చేసిన ‘సుడిగాడు’ పెద్ద విజయం సాధించిందని, ఆ సినిమా తర్వాత చేస్తున్న ఈ చిత్రంలో కూడా మంచి పాటలు ఉంటాయని అన్నారు. నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ మలయాళంలో పెద్ద హిట్ అయిన ఈ సినిమా బాగా నచ్చిందని, అల్లరి నరేష్‌ని కొత్త తరహా సినిమాలో చూడాలనుకున్నానని అన్నారు. ఈ చిత్రానికి మాటలు: చంద్రశేఖర్, కెమెరా: ఉన్ని ఎస్.కుమార్, సంగీతం: డి.జె.వసంత్, ఎడిటింగ్: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.కుమార్, నిర్మాత: బొప్పన చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ప్రజిత్.