ఘోస్ట్ అడ్వెంచర్ మరకతమణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది పినిశెట్టి, నిక్కిగల్రాణి జంటగా రిషి మీడియా, శ్రీచక్ర ఇన్నోవేషన్స్ పతాకాలపై తెలుగు, తమిళ భాషల్లో ఎ.ఆర్.కె.శరవణన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘మరకతమణి’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- స్టైలిష్ పాత్రలో ఆది పినిశెట్టి హీరోగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ లభించిందని, అడ్వెంచర్ ఘోస్ట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం పాత్రలు హైలెట్‌గా ఉంటాయని, ఈ సినిమా చూసే ప్రేక్షకుణ్ణి సర్‌ప్రైజ్ చేస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నామని అన్నారు. ఆనంద్‌రాజ్, అరుణ్‌రాజ్, కామరాజ్, రామదాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:దిబూ నైనస్ థామస్, కెమెరా:పి.వి.శంకర్, ఎడిటింగ్:ప్రసన్న.జి.కె., నిర్మాతలు:రిషి మీడియా, శ్రీచక్ర ఇన్నోవేషన్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎ.ఆర్.కె.శరవణన్.