సరికొత్త ట్రెండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి -2 ట్రైలర్ సామాజిక మాధ్యమంలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. ముఖ్యంగా యూట్యూబ్‌లో దీనిని జనం విరగబడి చూస్తున్నారు. ఇప్పటివరకు భారత్‌లో సినిమా ట్రైలర్ల పేర ఉన్న రికార్డులను బాహుబలి తుడిచిపెట్టింది. గురువారం ఉదయం విడుదలైన ఈ ట్రైలర్‌ను రెండుగంటల్లో 20 లక్షలమంది చూశారు. మరో మూడు గంటలు గడిచేసరికి చూసినవారి సంఖ్య 52 లక్షలకు చేరింది. సాయంత్రానికల్లా అంటే ట్రైలర్ విడుదలైన ఎనిమిది గంటల్లో 1.2 కోట్లమంది చూశారు. ఇప్పటివరకు భారత్‌లో ఎక్కువమంది చూసిన ట్రైలర్‌గా కబాలీ గత ఏడాది రికార్డు సృష్టించగా బాహుబలి -2 కొద్దిగంటల్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది. తొలిభాగానికి సంబంధించిన ట్రైలర్ 2015 జూన్‌లో విడుదలైతే ఇప్పటివరకు దానిని చూసినవారి సంఖ్య 78.41 లక్షలు మాత్రమే. తొలుత ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను గురువారం సాయంత్రం విడుదల చేయాలని అనుకున్నా, సాంకేతిక కారణాలతో ఉదయం 10 గంటలకే విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో ట్రైలర్ దర్శనమిచ్చినదే తడవు చూసేవారి సంఖ్య క్షణాల్లో పెరిగిపోయింది. ఏప్రిల్ 28న విడుదల కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకులకు ఎంత ఆసక్తి ఉన్నదో దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు.