నాగచైతన్య- చందు చిత్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగచైతన్య, శృతిహాసన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అక్కినేని అఖిల్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నివ్వగా నిర్మాత సురేష్‌బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో దిల్‌రాజు, జెమినీ కిరణ్, నల్లమలుపు బుజ్జి, దర్శకుడు మారుతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిత్ర వివరాలను గురించి నిర్మాత సూర్యదేవర నాగవంశి మాట్లాడుతూ నాగచైతన్య, శృతిహాసన్, చందుమొండేటిల కలయికలో మలయాళంలో ఘన విజయం సాధించిన ప్రేమమ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడం ఆనందంగా వుందని, మా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రమిదని, రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 3నుండి వైజాగ్‌లో ప్రారంభవౌతుందని అన్నారు. ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్యకావ్యంగా రూపొందే ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేస్తామని, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దర్శకుడు చందు కొన్ని మార్పులు చేసి, ఈ చిత్రాన్ని రూపొందిస్తాడని, త్వరలోనే టైటిల్‌ను నిర్ణయిస్తామని చెప్పారు. దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ, నాగచైతన్యతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో సినిమా చేయడం ఆనందంగా వుందని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: గోపీసుందర్, రాజేష్‌మురుగేశన్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కథ: ఆల్‌ఫోనే్స ఫుదరిన్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, దర్శకత్వం: చందు మొండేటి.