వైవిధ్యంగా కనిపించే కేశవవె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్, రీతూవర్మ, ఇషాగోపికర్ ప్రధాన తారాగణంగా అభిషేక్ పిక్చర్స్ పతాకంపై సుధీర్‌వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా రూపొందిస్తున్న చిత్రం ‘కేశవ’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేకింగ్ సరికొత్తగా హాలీవుడ్ తరహాలో వుందని, ఇంతవరకూ నిఖిల్ ఇలాంటి వైవిధ్యమైన కథనంలో నటించలేదని, అతని నటనలో మంచి గాఢత ఉందని, సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుందన్న నమ్మకం వుందని తెలిపారు. దర్శకుడు సుధీర్ 15 ఏళ్ళుగా తనకు మిత్రుడని, డిఫరెంట్‌గా సినిమా చేయాలని ఈ స్క్రిప్ట్‌తో తన దగ్గరకు వచ్చాడని, గతంలో తాను చేసిన చిత్రాలకు వైవిధ్యంగా వుంటుందని, షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని హీరో నిఖిల్ తెలిపారు. సినిమాను వేసవికి విడుదల చేయనున్నామని ఆయన అన్నారు. సినిమా మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఓ వైవిధ్యమైన కథనంతో సాగుతుందని, ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతి ఇస్తుందని దర్శకుడు సుధీర్‌వర్మ అన్నారు. బ్రహ్మాజీ, రావురమేష్, అజయ్, వెనె్నల కిశోర్, రాజా రవీంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు:కృష్ణచైతన్య, అర్జున్, కార్తీక్, ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, సంగీతం:సన్నీ ఎం.ఆర్., కెమెరా:దివాకర్ మణి, నిర్మాత:అభిషేక్ నామా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సుధీర్‌వర్మ.గాహీరో