కొత్తవారితో సరయు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుహాన్ శిష్టా, ఉజ్వల్ కిరీట్ ప్రధాన తారాగణంగా భగీరధ్ పరశురామ్ ప్రొడక్షన్స్ పతాకంపై రామ కె.శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సరయు’. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయి సెన్సార్‌కు సిద్ధమైంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం హైదరాబాద్‌లో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- లవ్, థ్రిల్, కథనాలతో రూపొందిస్తున్న ‘సరయు’ చిత్రం కొత్తవాళ్లతో రూపొందించడం కష్టమైనా చక్కగా తెరకెక్కించారని తెలిపారు. లవ్, థ్రిల్లర్ కథనాలతో రూపొందిన ఈ సినిమాను త్వరలో సెన్సార్‌కు పంపనున్నామని, ఉగాది తరువాత పాటలు విడుదల చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు రమ కె.శ్రీనివాస్ తెలిపారు. నాలుగు పాటలతో రూపొందిన ఈ చిత్రం నేటి యువతకు నచ్చే కథనంతో రూపొందిందని, ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలే ఈ సినిమాలో వుంటాయని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందిన ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు భగీరథ పరశురామ నాయుడు, రమాదేవి కర్రి తెలిపారు. కార్యక్రమంలో షణ్ముఖ్ తదితరులు పాల్గొన్నారు. నాజి, నవ్య, హారిక తదితరులు నటించారు.