బికినీ భామ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రత్తాలు... రత్తాలు’ అంటూ మెగాస్టార్ ఆ అమ్మడి అందాలు పొగిడేస్తూ పాడిన సాంగ్ బాగా పాపులర్ అవ్వడంతో ఈ అమ్మడి అసలు పేరు మరచిపోయి అందరు రత్తాలు.. రత్తాలు అంటూ పిలుస్తున్నారు! అసలే అందాలరాశి పైగా బికినీలో మత్తెక్కిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకున్నారా? రాయ్‌లక్ష్మి. లేటెస్టుగా ఐటెం సాంగ్స్‌తో దుమ్మురేపుతున్న ఈ అమ్మడికి చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఇలా ప్రత్యేక పాటలతో క్రేజ్ తెచ్చుకుంటోంది. ఛాన్సులు పెట్టేస్తోంది. చాలా రోజుల క్రితం బాలీవుడ్‌లో మొదలైన జూలి-2 సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి? ఇక బాలీవుడ్‌ని నమ్ముకుంటే లాభం లేదని అనుకుందో ఏమో.. సౌత్‌లోనే వచ్చిన ఐటెం సాంగ్స్ చేసి క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నాల్లో వుంది. ఈమధ్య ఐటెం భామగా మంచి క్రేజ్ తెచ్చుకున్న హంస నందినికి గట్టి పోటీ ఇస్తున్న రాయ్‌లక్ష్మి తాజాగా మరో క్రేజి సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేస్తున్నట్టు సమాచారం. ఇక లేటెస్టుగా ఈ అమ్మడు బికినీలో అందాలు ఆరబోసి షాక్ ఇచ్చింది.. దానికితోడు ఇది నా మొదటి బికినీ స్టిల్ అంటూ కామెంట్ కూడా పెట్టింది.