అందరూ మెచ్చే మిస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా శ్రీనువైట్ల దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ పతాకంపై నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మిస్తున్న ‘మిస్టర్’ సినిమా ట్రైలర్ లాంచ్ హైదరాబాద్‌లో బుధవారం జరిగింది. దర్శకుడు శ్రీను వైట్ల ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- ‘సినిమా బాగా వచ్చింది. మా టీమ్‌కు చాలా నమ్మకం ఉంది. మిస్టర్ సినిమా ట్రైయాంగిలార్ లవ్‌స్టోరీ. దాంతోపాటు ట్రావెల్ ఫిలిం, ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గకుండా ఉంటుంది. మిస్టర్ అంటే మంచివాడు అనేలా అర్థం ఇచ్చాం. వరుణ్‌కి సరిగ్గా సరిపోయిన పాత్ర ఇది. ఇక హీరోయిన్స్ ఇద్దరూ చాలా చక్కగా నటించారు. త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేస్తాం’ అన్నారు. లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ- ‘నాకు చాలా నచ్చిన పాత్ర దక్కింది. ముఖ్యంగా నన్ను నేను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశా. శ్రీనువైట్ల సినిమాలో చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు. హెబ్బాపటేల్ మాట్లాడుతూ- ‘చాలా ఆనందంగా ఉంది. మంచి సినిమా చేశాను. తప్పకుండా ఈ సినిమాతో నాకు మరింత మంచి పేరు వస్తుంది’ అన్నారు. హీరో వరుణ్‌తేజ్ మాట్లాడుతూ- ‘నిజంగా నాకు బాగా నచ్చిన పాత్ర ఇది. శ్రీనువైట్ల కథ చెప్పగానే వెంటనే ఓకె చెప్పా. అంతగా నన్ను ఆకట్టుకుంది. అలాగే సినిమాకు అన్ని టెక్నికల్ యాస్పెక్ట్స్ కుదిరాయి. ఈనెల 29న ఆడియో విడుదల చేస్తాం’ అన్నారు.