కథ మారుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఓ చిత్రం గూర్చి చర్చ చాలా బాగా జరుగుతోంది. అది మహానటి సావిత్రిపై రూపొందించే సినిమా మీద. సావిత్రిగా నటించడానికి కీర్తి సురేష్, జమున పాత్రలో నటించడానికి సమంత సిద్ధమయ్యారు. అయితే ఈ చిత్రంలో హీరోలుగా ఎవరు నటించనున్నారు అంటే, ఆసక్తికరమైన అంశం వినిపిస్తోంది. సావిత్రి జీవితంలో ఎన్టీఆర్, ఎఎన్నార్ ఎంత ముఖ్యులో, తమిళ నటులు శివాజీ గణేశన్, జెమిని గణేశన్, ఎంజిఆర్‌లు కూడా అంతే ముఖ్యమైన పాత్రలు. అయితే ఈ పాత్రలన్నీ ఒక ఎత్తు అయితే, ఆమె భర్త జెమిని గణేశన్ పాత్ర ఓ ఎత్తుగా రూపొందిస్తున్నారు. ఈ పాత్రలో ఎవరు నటించాలి అనే సందేహం కూడా కలుగుతోంది. స్వతహాగా జెమిని గణేశన్ హీరో అయినా, సావిత్రి జీవితంలో మాత్రం విలన్‌గానే మిగిలిపోయాడు. అటు హీరో, ఇటు విలనిజం షేడ్స్ వున్న నటుడు కోసం వెదుకుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు హీరో సూర్యను సంప్రదించాడట. సావిత్రి బయోపిక్‌ను యథాతథంగా రూపొందిస్తే మాత్రం తన పాత్ర నెగెటివ్‌గా వుంటుంది కనుక కొంచెం మార్పులు చేయమని అడిగాడట హీరో. మరి దర్శకుడు హీరో కోసం కథ మారుస్తాడో, లేక మరో నటుడ్ని వెతుక్కుంటాడో వేచి చూడాల్సిందే!