రవితేజ బోగన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య సినిమాల విషయంలో కాస్త నిరాశతో వున్నాడు రవితేజ. వరుస పరాజయాల తరువాత ‘బెంగాల్ టైగర్’ చిత్రం కాస్త ఊరటనిచ్చినా, కొంత గ్యాప్ తీసుకుని కొత్త ఉత్సాహంతో సినిమాలు చేయాలనే ప్రయత్నంతో ఏడాది గ్యాప్ తీసుకుని రెండు సినిమాలని మొదలుపెట్టాడు. ‘టచ్ చేసి చూడు’, ‘రాజా ది గ్రేట్’ చిత్రాలు నిర్మాణం దశలో వున్నాయి. అయితే తాజాగా రవితేజ దృష్టి ఓ తమిళ సినిమాపై పడిందట. ఇటీవలే తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన భోగన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట రవితేజ. జయం రవి, అరవింద్‌స్వామి, హన్సిక ముఖ్యపాత్రల్లో నటించిన మాస్ ఎంటర్‌టైనర్ తనకు తెలుగులో మంచి క్రేజ్ తెస్తుందని, ఇప్పటికే ఆ దిశగా చర్చలు జరుపుతున్నాడని సమాచారం. తమిళంలో లక్ష్మణ్ రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ఆయనే దర్శకత్వం వహిస్తాడని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం వుంది.