రక్షకభటుడు ట్రైలర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ బ్యానర్‌పై ఎ.గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం ‘రక్షకభటుడు’. మరో విషయమేమంటే ఈ సినిమాలో పెద్ద స్టార్ హీరోలెవరూ లేకపోవడమే. కంటెంట్‌ను హీరోగా పెట్టి దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. సినిమాను ఏప్రిల్ 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల మాట్లాడుతూ- సినిమాను ఏప్రిల్ 7న విడుదల చేయబోతున్నాం. సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయడానికి యూనిట్ సభ్యులందరూ రాత్రి పగలు ఎంతో కష్టపడ్డారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా బెస్ట్ మూవీ అవుతుందని చెప్పగలను. ట్రైలర్‌లో చూసిన దానికంటే పవర్‌ఫుల్ సబ్జెక్ట్ సినిమాలో వుంది. సినిమా ఓ స్టైలిష్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అన్నారు.
నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ- మల్హర్‌భట్ జోషి ప్రతి సీన్‌ను ఎంతో అందంగా చూపించారు. రిచా పనయ్ లేడీ టైగర్‌లా సినిమాను అనుకున్న సమయంలో పూర్తిచేయడానికి సపోర్టు చేసింది. రక్ష, జక్కన్న వంటి సూపర్‌హిట్ చిత్రాలు చేసిన దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల చేసిన మూడో సినిమా ఇది. కథే హీరోగా రూపొందిన ఈ సినిమా అవుట్‌పుట్ బావుండాలని అన్‌కాంప్రమైజ్డ్‌గా కష్టపడ్డాం. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. సినిమాను ఏప్రిల్ 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. రిచా పనయ్ మాట్లాడుతూ- ఈ సినిమాలో నటించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. గురురాజ్, వంశీకృష్ణ ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌తోనే సినిమాను అనుకున్న విధంగా పూర్తిచేయగలిగాం అన్నారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వర్‌రెడ్డి, శేఖర్ చంద్ర, మల్హర్‌భట్ జోషి, రాంజగన్, అదుర్స్ రఘు, కృష్ణేశ్వర్, ధన్‌రాజ్, జ్యోతి, ఎడిటర్ అమర్ తదితరులు పాల్గొన్నారు. రిచా పనయ్, బ్రహ్మానందం, బాహుబలి ప్రభాకర్, బ్రహ్మాజీ, సుప్రీత్, అదుర్స్ రఘు, ధన్‌రాజ్, నందు, చిత్రం శ్రీను, సత్తెన్న, జ్యోతి, కృష్ణేశ్వరరావు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: మల్హర్ భట్ జోషి, ఎడిటింగ్: అమర్‌రెడ్డి, ప్రొడ్యూసర్: ఎ.గురురాజ్, రచన, దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల.