నాగశౌర్య హీరోగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య హీరోగా, రష్మిక మండనన్ హీరోయిన్‌గా తెలుగుకి పరిచయం చేస్తూ వెంకి కుడుములని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు ఉషా మూల్పూరి, శంకర్ ప్రసాద్ మూల్పూరిలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా, కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ చిత్రం ఏప్రిల్ 10న రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమవుతుంది. ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ -ఈ చిత్ర వివరాలను నిర్మాతలు తెలియజేశారు. శంకర్ ప్రసాద్ మూల్పూరి మాట్లాడుతూ- నాగశౌర్యతో చిత్రాన్ని నిర్మించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాము. వెంకి కుడుముల చెప్పిన కథ మాకు నచ్చి, కథకి సరిపోయేలా హీరోయిన్ రష్మిక మండనన్ ఎంచుకున్నాము. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో వెరీ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాగర్ మహతి, సినిమాటోగ్రఫి: సాయిశ్రీరామ్, నిర్మాతలు: ఉషా మూల్పూరి, శంకర్ ప్రసాద్ మూల్పూరి, దర్శకత్వం: వెంకి కుడుముల.