కళాసుధ ఉగాది పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా అందిస్తున్న సినిమా అవార్డుల వేడుక చెన్నై మ్యూజిక్ అకాడమీలో జరిగింది. పలువురు సినీ అవార్డు గ్రహీతలకు మండలి బుద్ధప్రసాద్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- చెన్నై పట్టణంలో శ్రీకళాసుధ సంస్థ సినిమా రంగానికి చెందిన అవార్డులను అందిస్తుండడం ఆనందదాయకమని, ఈ అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. 37 ఏళ్ల క్రితం ఇక్కడే అవకాశాలను వెతుక్కుంటూ తిరిగిన రోజులు గుర్తుకు వస్తున్నాయని, చెన్నైతో ప్రత్యేక అనుబంధం వున్న తాను, ఇక్కడి రావడానికి ఇష్టపడతానని, కళాసుధ సంస్థ మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని నటుడు శివాజీ రాజా కోరుతున్నారు. తాను తీసిన ‘మనలో ఒకడు’ సినిమా నోట్ల రద్దు సమయంలో రావడంతో అందరికీ చేరలేదని, అది సమాజానికి పనికివచ్చే సినిమాగా రూపొందించానని సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ తెలిపారు. గత 18 ఏళ్ళుగా తమ సంస్థ సినిమా రంగంలోని వారికి అవార్డులు అందిస్తుందని, ఉగాది రోజున ఈ అవార్డులు అందుకున్న అందరికీ అభినందనలు అని బేతిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు.
**

అవార్డు గ్రహీతలు :
ఆర్.పి.పట్నాయక్ (ఉత్తమ సామాజిక చిత్రం - మనలో ఒకడు)
రోషన్ (ఉత్తమ నూతన నటుడు, నిర్మలా కానె్వంట్)
నందితా శే్వత (ఉత్తమ నూతన నటి, ఎక్కడికి పోతావు చిన్నవాడా)
వంశీ పైడిపల్లి (ఉత్తమ దర్శకుడు- ఊపిరి)
ఎం.రాజా (ఉత్తమ కథ- ధృవ)
పరశురామ్ (ఉత్తమ మాటల రచయిత - శ్రీరస్తు శుభమస్తు)
వి.ఐ.ఆనంద్ (ఉత్తమ కథనం - ఎక్కడికి పోతావు చిన్నవాడా)
చైతన్య ప్రసాద్ (ఉత్తమ పాటల రచయిత)
కె.సి.అమృతవర్షిణి (ఉత్తమ గాయని- పెళ్లిచూపులు)
చందూ మొండేటి (ప్రత్యేక జ్యూరీ అవార్డు - ప్రేమమ్)