బాలయ్య సరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు పూరి జగన్నాథ్ నందమూరి బాలకృష్ణ 101 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ను ఏప్రిల్ 5 నుండి ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన నటించడానికి కొత్త హీరోయిన్ ముస్కాన్‌ను ఫైనల్ చేసిన పూరి మరో ఇద్దరు హీరోయిన్లను కూడా సెలెక్టు చేశాడట. వాళ్లల్లో ఒకరు అమలాపాల్ అని సమాచారం. అమలాపాల్ ఇప్పటివరకు బాలయ్య సరసన నటించకపోవడంతో వారి జోడి స్క్రీన్‌మీద ఫ్రెష్‌గా అనిపిస్తుందని, పైగా అమలాపాల్ గతంలో తను తీసిన ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంలో నటించి ఉండటంతో ఆమెను ఖాయం చేశాడట పూరి. ఇక మరొక హీరోయిన్ ఛార్మి నటించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమాచారంపై చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎలాంటి అఫిషియల్ కన్‌ఫర్‌మేషన్ అందలేదు. బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్ తరహా పాత్రలో కొత్త లుక్‌తో కనిపించనున్న ఈ చిత్రానికి సెప్టెంబర్ 29వ తేదీని రిలీజ్ డేట్‌గా ఫిక్స్ చేశారు.