4 ఆటల సినీ మహల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళానిలయ క్రియేషన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘సినీ మహల్’ (రోజుకు 4 ఆటలు). లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో బి.రమేష్ రూపొందించిన ఈ సినిమా నేడు విడుదల అవుతోంది. గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ- ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం డిఫరెంట్ కానె్సప్ట్ మూవీగా రూపొందించామని, శేఖర్ చంద్ర సంగీతం, దొరై.కె.సి కెమెరా పనితనం హైలైట్‌గా వుంటాయని తెలిపారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు థ్రిల్లింగ్‌గా సాగే ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని దర్శకుడు లక్ష్మణ్ వర్మ తెలిపారు. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో ప్రేక్షకులకు కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని అలీ రాజా, సోహైల్ తెలిపారు. గొల్లపూడి మారుతీరావు, జీవా, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, నిర్మాత: బి.రమేష్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లక్ష్మణ్ వర్మ.