వేధింపులు తక్కువేం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం సినీ కథానాయికలు ఎదుర్కొంటున్న పరిణామాలను చూస్తే బాధగా వుంది అంటోంది స్టార్ హీరోయిన్ ఇలియానా. అయితే ఎంతో కొంత ప్రొటెక్షన్‌తో ఉండే సినీ స్టార్స్‌కే ఇలాంటి ఘటనలు ఎదురవుతున్నాయంటే ఇక సాధారణ మధ్యతరగతి అమ్మాయిల పరిస్థితి ఏంటని ఈ అమ్మడు తన బాధను ఓ న్యూస్ ఛానల్ ద్వారా తెలిపింది. అంతేకాకుండా తెర వెనుక హీరోయిన్లను చాలా దారుణంగా లైంగికంగా వేధిస్తారని చెప్పి ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేసింది. సినిమాల్లోకి అడుగుపెట్టిన మొదట్లో చాలామంది సినీ పెద్దలు తనను కూడా లైంగికంగా వేధించేవారని చెప్పింది. రీసెంట్‌గా భావనకు జరిగిన ఇన్సిడెంట్‌ను గుర్తుచేసుకుంటూ తాను కూడా కొంతమందివల్ల ఎంతో బాధను అనుభవించానని, తనకు జరిగిన ఘటనను గురించి చెబుతూ.. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌గా వున్న రోజుల్లో ఒక అబ్బాయి నన్ను ప్రతిరోజూ ఫాలో అయ్యేవాడు. చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని. చివరికి నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడడానికి ప్రయత్నించేవాడు. నేను బాధగా ఉండటం చూసిన మా అమ్మ విషయాన్ని తెలుసుకొని అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో మరుసటి రోజునుంచి ఆ కుర్రాడు కనిపించలేదు అంటూ చెప్పింది ఇలియానా.