ప్రేమాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది సొట్టబుగ్గల తాప్సీ. లేటెస్టుగా ఆమె నటించిన ‘మై నేమ్ ఈజ్ శబానా’ చిత్రం ఇటీవలే విడుదలైంది. సినిమా సినిమాతో క్రేజ్ పెంచుకుంటున్న తాప్సీ, ప్రస్తుతం ప్రేమాయణం సాగిస్తోందని బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. దానికి ముఖ్య కారణం- ఇటీవలే ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో తాప్సీ స్పందిస్తూ, తాను ఒంటరిగా లేనని చెప్పడం విశేషం. దానికితోడు అతగాడితో ప్రేమాయణం సాగిస్తుండడం గర్వంగా వుందని కూడా చెబుతోందట. ముఖ్యంగా తాప్సీ ఇలా చెప్పడానికి కారణమెవరా అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఇంతకీ తాప్సీతో ప్రేమాయణం సాగిస్తున్నది ఎవరో కాదు, డెన్మార్క్ బాడ్మింటన్ ప్లేయర్ మతియాస్ బోయ్ అని తెలిసింది. బాడ్మింటన్‌లో పాపులర్ అయిన ఇతగాడితో తాప్సీ కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగిస్తుందని, ముఖ్యంగా ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని కూడా వార్తలొస్తున్నాయి. సౌత్‌లో హీరోయిన్‌గా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన కమర్షియల్ బ్రేక్ రాకపోవడంతో తాప్సీ బాలీవుడ్‌కి చెక్కేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో కెరీర్ బాగుందని, మంచి సినిమాలు దక్కుతున్నాయని సంబరపడుతోంది.