అదిరిపోయే సెట్టింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన కాటమరాయుడు చిత్రం మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా తరువాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం ఈ నెల చివరిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం ఫిలింసిటీలో భారీ స్థాయిలో ఇల్లు, ఆఫీసులకు సంబంధించిన సెట్‌లను వేస్తున్నారు. జల్సా, అత్తారింటికి దారేది తరువాత వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కూడా ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో వుంటుందని, ముఖ్యంగా తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో కథ సాగుతుందని సమాచారం. హారికా హాసిని బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ‘దేవుడే దిగివచ్చినా’ అనే టైటిల్ పెడతారంటూ ప్రచారం సాగుతోంది.