లుక్ మారుతోంది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు తెలుగు సినిమాలో హీరో అంటే అందంగా, నీట్‌గా షేవ్ చేసుకుని నీట్‌గా దువ్వుకొని, టక్ చేసుకుని మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్‌గా, చూడగానే వీడు 100 పర్సెంట్ మంచివాడే అనే ముద్ర వేసేవాడు. దీనికి వ్యతిరేకంగా విలన్ ఉండడం సహజమే. ఇక సినిమాల్లో హీరో గెడ్డం పెంచాడంటే, కచ్చితంగా వాడి ప్రేమ అటకెక్కిందని హింట్ వచ్చినట్టే. ఇలా సాగుతున్న తెలుగు సినిమా రాను రాను రొటీన్ పదాన్ని రొటీన్‌గా మార్చేసేందుకు ఇప్పటి తరం యువ హీరోలు నడుం కట్టారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సాగుతోంది. ముఖ్యంగా హీరోల ఆహార్యంలో చాలా మార్పులే వచ్చాయి. కచ్చితంగా చూస్తే తప్ప వీడే హీరో అనేలా ఉండడం లేదెవరు. ఇప్పుడున్న హీరోలు గెడ్డాలకు అలవాటు పడ్డారు. నున్నగా షేవ్ చేసుకునే రోజులు పోయాయి. గెడ్డం ఎంత స్టైల్‌గా భారీగా పెరిగితే అంత ఫ్యాషన్‌గా మారిపోయింది. ఆ మధ్య చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల టైమ్‌లో చిరుగడ్డాలతో సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త లుక్‌లో వాళ్ళు కనిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వెంకటేష్ నటించిన ‘గురు’ సినిమాలో గెడ్డంతో కొత్త లుక్‌ను పరిచయం చేశాడు.
ఇక యువ హీరోలు ఎన్టీఆర్ మొదటిసారి ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో భారీ గెడ్డాన్ని పెంచేసి సినిమా మొత్తం అదే స్టైల్‌ను కొనసాగించాడు. ఎన్టీఆర్‌ను మొదటిసారి ఆ లుక్‌లో చూసిన వారంతా షాక్ అయ్యారు. కొత్తగా ఉన్నాడని ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఆ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ఆ తరువాత నటించిన జనతా గ్యారేజ్‌లో చిరుగడ్డంతో కనిపించడం విశేషం. తాజాగా సుకుమార్ రూపొందిస్తున్న సినిమ కోసం రామ్‌చరణ్ కూడా ట్రెండ్ మార్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన భారీ గడ్డంతో కనిపిస్తాడట. లేటెస్టుగా విడుదలైన నితిన్ ‘లై’ చిత్రంలో కూడా భారీ గడ్డంతో కొత్త లుక్‌ను తీసుకువచ్చాడు. ఇక తమిళ హీరోల్లో అజిత్ తెల్లని గడ్డంతో సినిమాల్లో నటించి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యం గా కబాలిలో రజనీకాంత్ పెప్పర్‌సాల్ట్ లుక్‌లో కనిపించి కబాలి రా! అని అదరగొట్టిన విష యం తెలిసిందే. ఇక లేటెస్టుగా రామ్ కూడా తన తదుపరి చిత్రం కోసం భారీ గడ్డాన్ని పెంచేశాడు. ఇప్పటికే చాలామంది హీరోలు ఈ గెడ్డం లుక్‌కు అలవాటుపడుతున్నారు. ఈమధ్యే మెగా హీరో వరుణ్‌తేజ్ కూడా ఓ కమర్షియల్ యాడ్ కోసం ఈ భారీ గెడ్డంలో ఫోజిచ్చేశాడు. ఇక పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ కూడా ఆ మధ్య భారీ గెడ్డాన్ని పెంచి కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి తెలుగు హీరోల లుక్ మారింది! అలాగే భిన్నమైన కథలతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపడం మంచి పరిణామమే!!

- శ్రీ