ఒరేయ్.. ఒసేయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జున్ మహి, అశ్విని జంటగా రవిచంద్ర కన్నికంటి దర్శకత్వంలో శ్రీ మూవీ మేకర్స్ పతాకంపై వీరగంగాధర్ రిమ్మలపూడి నిర్మించిన ‘నువ్వు నేను ఒరేయ్ ఒసేయ్’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో హీరోయిన్ అశ్విని మాట్లాడుతూ- టైటిల్ చాలా కొత్తగా వుంది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించే సినిమా. గోదావరి తీర ప్రాంతాల్లో అహ్లాదకర వాతావరణంలో రూపొందించిన ఈ చిత్రం మంచి కథతో తెరకెక్కింది. ముఖ్యంగా దర్శకుడు అద్భుతంగా రూపొందించాడన్నారు. దర్శకుడు రవిచంద్ర మాట్లాడుతూ- సాఫ్ట్‌వేర్ రంగం నుండి సినిమాల్లోకి వచ్చాను. నిర్మాత వీర గంగాధర్ నేను చెప్పిన కథ నచ్చడంతో ఆయన సినిమా నిర్మించడానికి రెడీ అయ్యాడు. అనుకున్న విధంగా చిత్రాన్ని తెరకెక్కించాం. ముఖ్యంగా 5 పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు.