రొమాంటిక్ థ్రిల్లర్‌గా సమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాగంటి శ్రీనాథ్ హీరోగా మిసిమి క్రియేషన్స్ పతాకంపై రాజాశ్రీ దర్శకత్వంలో రమేష్ నిర్మిస్తున్న చిత్రం ‘సమయం’. సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ.. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్‌లో మా హీరో శ్రీనాథ్ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించాం. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రమిది. ప్రేమ, రొమాన్స్, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కుతున్న చిత్రమిది అన్నారు. హీరో శ్రీనాథ్ మాట్లాడుతూ సెట్‌లో పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా వుంది. ఈ సినిమాతోపాటు మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నాను. ఈ మూడు చిత్రాలు నాలోని ప్రతిభను బయటకు తెచ్చేలా ఉన్నాయి. సమయం సినిమా మంచి కథాకథనంతో తెరకెక్కుతుంది అన్నారు.