త్వరలో కళ్యాణ వైభోగమే పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య, మాళవికానాయర్ జంటగా బి.వి.నందినీరెడ్డి దర్శకత్వంలో శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్.దామోదర్‌ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధవౌతున్న సందర్భంగా చిత్ర వివరాలను గురించి చిత్ర నిర్మాత దామోదర్‌ప్రసాద్ తెలియజేస్తూ, ప్రస్తుతం యువతలో పెళ్లి, ప్రేమలాంటి బంధాలపై ఉన్న అభిప్రాయాలను అందరికీ అర్ధమయ్యేలా కామెడీ, మ్యూజిక్ ఎంటర్‌టైనర్‌గా మేళవించి రూపొందించిన చిత్రమిది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని, ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే ఆడియోను విడుదల చేసి, డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కళ్యాణ్ కోడూరి, ఎడిటింగ్: జునైద్ సిద్ధిక్, కెమెరా: జి.వి.ఎస్.రాజు, సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల, జగన్మోహన్‌రెడ్డి, నిర్మాత: కె.ఎల్.దామోదర్‌ప్రసాద్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి.వి.నందినీరెడ్డి.