ఇది మా ప్రేమకథ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవి, మేఘన లోకేష్ జంటగా మత్స్య క్రియేషన్స్, పిఎల్‌కె ప్రొడక్షన్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఇది మా ప్రేమకథ’. అయోధ్య కార్తీక్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ గతంలో పూరి జగన్నాథ్ విడుదల చేయగా, నేడు చిరంజీవి మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. యాంకర్ రవి కథానాయకుడుగా తాము రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలో ట్రైలర్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామన్నారు. త్వరలో వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకు వస్తామని దర్శకుడు తెలిపారు. చిరంజీవి లాంటి అగ్రహీరో తమ కార్యక్రమానికి విచ్చేసి మోషన్ పోస్టర్‌ను విడుదల చేయడం ఆనందంగా వుందని రవి, మేఘన లోకేష్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మోహన్‌రెడ్డి, పాటలు: దినేష్, సంగీతం: కార్తీక్ కొడకంట్ల, నిర్మాణం: మత్స్య క్రియేషన్స్, దర్శకత్వం: అయోధ్య కార్తీక్.