‘మా’ నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా శివాజీరాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నూతన కార్యవర్గం ఎంపిక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. శివాజీరాజా అధ్యక్షతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ‘మా’ తరఫున ప్రముఖ సీనియర్ దర్శకులు కె.విశ్వనాథ్, సీనియర్ నటీమణి శారద, ప్రముఖ నటుడు కృష్ణ, విజయనిర్మలను సత్కరించారు. అనంతరం తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ గత ‘మా’ ఎన్నికలు గట్టి పోటీ మధ్య అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి. కానీ ఈసారి టీమ్ అంతా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా వుంది. అప్పట్లో చిరంజీవి, కృష్ణ లాంటి పెద్దల ఆధ్వర్యంలో మా సంస్థకు బీజం పడింది. నాటినుంచి నేటివరకు కళాకారుల శ్రేయస్సు కోసం అందరూ కృషిచేస్తున్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ‘మా’కు సహకారం అందించేందుకు సిద్ధంగా వున్నాం. ప్రభుత్వం తరఫున వెయ్యి రూపాయల పింఛను, పేద కళాకారులకు రేషన్ కార్డులు అందించాలనుకుంటున్నాం. ‘మా’ సభ్యులలో అనారోగ్య సమస్యలు తలెత్తితే నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే చిన్న సినిమాలకి థియేటర్లు దొరకడం లేదు కాబట్టి ఐదవ ఆట ప్రదర్శించేలా చర్యలు చేపట్టాం. దేశంలో ఇప్పటివరకు ఈ విధానం ఎక్కడా అమలులో లేదు. అలాగే షూటింగ్‌ల పర్మిషన్లకోసం ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటాం. దసరా నుంచి నంది అవార్డుల స్థానంలో కొత్త పేరుతో అవార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది అన్నారు. నూతన అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ ‘మా’లో సభ్యులంతా నన్ను విశ్వసించి నాకీ బాధ్యత అప్పగించారు. దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తాను. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కమిటీతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తాం. పెన్షన్‌ను 25 శాతం పెంచుతున్నాం. ఈ నెల నుంచే కొత్త విధానం అమల్లోకి వస్తుంది. అలాగే ‘మా’కు కొత్త భవనాన్ని ఏర్పాటయ్యే విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలవనున్నాం. ఆర్టిస్టులంతా మాలో మెంబర్‌షిప్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈసారి సిల్వర్ జూబ్లీ వేడుకలు సినీ పెద్దల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తాం అన్నారు. ‘మా’టీమ్ శివాజీరాజా (ప్రెసిడెంట్), ఎం.శ్రీకాంత్ (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), ఎం.బి.బెనర్జీ (వైస్ ప్రెసిడెంట్), కె.వేణుమాధవ్ (వైస్ ప్రెసిడెంట్), వి.కె.నరేష్ (జనరల్ సెక్రటరీ), హేమ (జాయింట్ సెక్రటరీ), ఏడిద శ్రీరామ్ (జాయింట్ సెక్రటరీ), పరుచూరి వెంకటేశ్వరరావు (ట్రెజరర్).