ప్రభాస్ ‘సాహో’రే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం అందరి చూపు బాహుబలి-2 పైనే వుంది. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన రాజవౌళి రూపొందిస్తున్న బాహుబలి-2 చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఈ నెల 28న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాతో ప్రభాస్ యూనివర్సల్ స్టార్‌గా మారిపోయాడు. దాదాపు ఐదేళ్ల కాలాన్ని బాహుబలి కోసం కేటాయించిన ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని అప్పుడే ప్రకటించేశాడు. ‘రన్‌రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందే చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం మేలో సెట్స్‌పైకి రానుంది. ఇక ఈ చిత్రానికి టైటిల్ కన్‌ఫర్మ్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సాహో’ అనే టైటిల్‌ను ఖరారుచేసేలా ఉన్నారు. ఎందుకంటే లేటెస్ట్‌గా ఈ బ్యానర్‌పై ‘సాహో’ టైటిల్‌ను ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించడంతో ప్రభాస్ సినిమాకు ఇదే టైటిల్ పెడుతున్నారంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉంటాయి. మరి ఆ అంచనాల్ని అందుకునేలా సినిమాను రూపొందించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.