రజనీ-రాజకీయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడు రాజకీయాలు ఎప్పటికప్పుడు వింతగానే సాగుతుంటాయి. రాజకీయాలలో సినిమా అనే అంశం చేరిపోయి, సినిమా నటులే ముఖ్యమంత్రి పదవిని అలంకరించి చరిత్ర సృష్టించిన రాష్టమ్రే తమిళనాడు. తమిళులకున్న సినీ అభిమానమే ఆయా హీరోలను ముఖ్యమంత్రులుగా చేసింది. గతంలో ఎంజిఆర్ సృష్టించిన ప్రభంజనంతో సినిమా నటులు కూడా రాజకీయాలలో అద్భుతాలు సృష్టించగలరు అని నిరూపణ అయింది. ఇదే బాటలో కథానాయిక జయలలిత కూడా చరిత్ర సృష్టించారు. ఒక అబల రాజకీయాలను శాసించగలిగే స్థాయికి వెళ్లింది అంటే అది కూడా సినీ ప్రభావమే. సినిమా గ్లామర్ ముందు రాజకీయాలు వెలవెలపోయిన కథలు తమిళనాడులో బాగా కనిపిస్తాయి. తమిళులకు తమకు బాగా పరిచయం వున్నవారే నాయకులుగా ఎదిగితే ఆనందం. తమకు బాగా ఇష్టమైన భాష మరింత అభివృద్ధి చెందితే సంతోషం. అలా తమిళుల ఆశయాలను సినీ పరిశ్రమ ఎప్పటికప్పుడు తీరుస్తూ వచ్చింది. ఇదంతా గతం. ప్రస్తుతం జయలలిత లేని లోటును సినీ గ్లామర్ పూడ్చలేకపోతోంది.
సరైన నాయకత్వం లేకపోవడంతో సినిమా వారసులే మళ్లీ రాజకీయాల్లోకి రావాలన్న తలంపు ఎప్పటికప్పుడు బలం పుంజుకుంటోంది. ఆ మధ్య జయలలిత వారసుడిగా హీరో అజిత్ అరంగేట్రం చేస్తారన్న వార్తలు వినిపించాయి. మళ్లీ ఏమైందో నిశ్శబ్దమై పోయింది. ఇప్పుడు మళ్లీ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు పిలుపునిస్తున్నారు. కోడంబాకంలోని కార్యాలయాలలో అభిమానులు వచ్చి రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే రజనీకాంత్ తన అభిమాన సంఘాలను ప్రోది చేసి సిద్ధంగా ఉంచారు. త్వరలో రజనీకాంత్ తన రాజకీయ రంగప్రవేశం గురించి ప్రకటిస్తారని వార్తలు వినవస్తున్నాయి. అయితే రజనీకాంత్ మాత్రం ఎన్నడూ నోరు తెరచి రాజకీయాల్లోకి తాను వస్తున్నానని ప్రకటించలేదు. కొన్నాళ్లు అభిమానులందరూ రజనీ రాజకీయాల్లోకి వస్తున్నాడని ప్రచారం చేస్తారు. ఆ వెంటనే రజనీకాంత్ అనుయాయులు అలాంటిదేమీ లేదని చెబుతారు. వీలైతే రజనీకాంతే తనకు రాజకీయాలు సరిపడవని, అందువల్ల తాను అటువైపు వచ్చే అవకాశం లేదని ప్రకటిస్తున్నారు. ఇదంతా గమనిస్తున్నవారు మాత్రం ఒక్క అభిమానులే కాక రాష్ట్ర ప్రజలందరూ సామూహికంగా పిలుపునిస్తే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం అగ్ర కథానాయకుడిగా తమిళ చిత్ర పరిశ్రమలో వెలుగొందుతున్న రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం చారిత్రాత్మక అవసరం అన్నట్లుగా తయారైంది. అందుకే అభిమానులు తమ హీరోను ముఖ్యమంత్రిగా చూడాలని కలలు కంటున్నారు. రజనీకాంత్ మాత్రం ఎప్పటికప్పుడు తామరాకు మీద నీటిబొట్టులా ఎప్పటికప్పుడు రాజకీయాలు అంటని నీటిచుక్కలా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఆయనకు వెన్నుదన్నుగా నిలవాల్సిన వారందరూ ఒక్క తాటిమీద ఏకమైతే రజనీకాంత్ తప్పక రాజకీయాల్లోకి వస్తారు అని సినీ రాజకీయ పండితులు చెన్నయ్‌లో విశే్లషిస్తున్నారు. తమిళులకు రజనీకాంత్ ఓ తీపి వార్త చెబుతారని ఎదురుచూస్తున్నారు.

- యు