సినిమా హాల్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘సినీ మహల్’. ‘రోజుకు 4 ఆటలు’ అనేది ఉప శీర్షిక. లక్ష్మణ్‌వర్మ దర్శకత్వం వహించారు. బి.రమేష్ నిర్మాతగా, పార్థు, బాలాజీ, మురళీధర్, మహేంద్ర సహ నిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కింది. అలీరాజా, సోహెల్, తేజస్విని నాయకానాయికలు. ఈ సినిమా మార్చి 31న విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన సక్సెస్ మీట్‌లో.. దర్శకుడు లక్ష్మణ్‌వర్మ మాట్లాడుతూ.. డిఫరెంట్ సినిమాలను ఆదరిస్తారని ప్రేక్షకులు మరోసారి ప్రూవ్ చేశారు. ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ అన్నారు. అలీరాజా మాట్లాడుతూ.. కొత్త జోనర్‌లో రూపొందిన చిత్రం. నా రోల్‌కు చాలా మంచి అప్రిసియేషన్ వస్తుంది. ఇలాంటి ఓ విజయవంతమైన చిత్రంలో నాకు నటించే అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ అన్నారు. సోహెల్ మాట్లాడుతూ.. ‘విలేజ్, అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినీ మహల్ చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. చాలామంది ఫోన్‌చేసి సినిమా బావుందని అప్రిషియేట్ చేస్తున్నారు. సినిమా సక్సెస్‌లో భాగమైన అందరికీ థాంక్స్ అన్నారు. నిర్మాత పార్థు మాట్లాడుతూ.. దర్శకుడు లక్ష్మణ్‌గారు చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. సినిమా విడుదలైన రోజు నుండే మంచి ఆదరణతో ముందుకు సాగుతోంది. శేఖర్‌చంద్ర మ్యూజిక్, సలోని స్పెషల్ సాంగ్‌కు మంచి స్పందన వస్తుంది. సినిమా సక్సెస్‌ఫుల్‌గా రెండోవారంలో అడుగుపెట్టింది అన్నారు.