7న లక్ష్మిదేవి సమర్పించు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణ, జనని, అఖిల్, భార్గవి, చరణ్, ప్రజ్ఞ జంటలుగా కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో జాకీ అతిక్ దర్శకత్వంలో మేరువ సుబ్బారెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి’. హైదరాబాద్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడంతోపాటు పాటలను కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీనియర్ నరేష్ మాట్లాడుతూ సోషియో ఫాంటసీ చిత్రంగా ‘లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి’ చిత్రం రూపొందింది. ‘దేవుళ్లు’ సినిమా తీయాలనుకుంటే వారికి వచ్చే ఇబ్బందులను, సమస్యలను ఈ చిత్రంలో చూపించారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ జాకీ అద్భుతంగా దర్శకత్వం చేశారు. సుబ్బారెడ్డి సినిమాను రిచ్‌గా నిర్మించారు. నటుడు గౌతంరాజు కొడుకు కృష్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. ప్యాడింగ్ స్టార్స్ అందరూ ఈ చిత్రంలో నటించారు. ట్రైలర్, పాటలు బావున్నాయి. 7న సినిమా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు. హీరో కృష్ణ మాట్లాడుతూ సినిమా పూర్తయింది. హీరో కావాలనుకునే కుర్రాడి పాత్రలో నటించాను. జాకీ సినిమాను ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించారు. జనని, సి.జె, శోభారాణి, సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, గౌతంరాజ్, తదితరులు పాల్గొన్నారు.