సిద్ధమైన మిక్చర్‌పొట్లం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయంత్, గీతాంజలి, శే్వతాబసుప్రసాద్ ప్రధాన తారాగణంగా గోదావరి సినీ టోన్ పతాకంపై సతీష్‌కుమార్.ఎం.వి. దర్శకత్వంలో కలపటపు శ్రీలక్ష్మిప్రసాద్, కంటె వీరన్నచౌదరి, లంకలపల్లి శ్రీనివాస్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘మిక్చర్‌పొట్లం’. ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ పూర్తయి తొలికాపీ సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ఇటీవల విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని, ముఖ్యంగా సుచిత్ర పాడిన ‘హలో బేబీ..’ సూపర్‌హిట్‌గా నిలిచిందని తెలిపారు.
సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ యువత పల్స్ పట్టుకుని ప్రతి ట్యూన్ వైవిధ్యంగా సమకూర్చారని తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. షూటింగ్ అంతా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చేశామని, ప్రతి సీన్ ఓ అందమైన పెయింటింగ్‌లా ఉంటుందని, హీరో హీరోయిన్లు కొత్తవారైనా బాగా నటించారని వారు తెలిపారు. కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూడదగ్గ ఈ సినిమాలో ప్రతి పాత్ర వైవిభ్యభరితంగా ఉంటుందని వారన్నారు. భానుచందర్, సుమన్, కృష్ణ్భగవాన్, పోసాని కృష్ణమురళి, అలీ, చిట్టిబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు:వెనె్నలకంటి, చిర్రావూరి విజయకుమార్, రాంభట్ల నరసింహశర్మ, భాషాశ్రీ, కెమెరా:కళ్యాణ్ సమి, ఎడిటింగ్:ఎం.ఆర్.వర్మ, దర్శకత్వం:సతీష్‌కుమార్ ఎం.వి.